ఉస్మానియా యూనివర్సిటీ గ్లోబల్ అల్యూమిని 2023 రెండవ రోజు కామర్స్ మరియు బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల ఆడిటోరియంలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా కామర్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ శ్రీరాములు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉస్మానియా విద్యార్థులు ఏకం చేయడం కోసం ఓయూ చరిత్రలో మొట్టమొదటిసారిగా గ్లోబల్ అల్యూమిని మీట్ ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయం అన్నారు. విద్యార్థుల సమ్మేళనంలో 300 మంది పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు వారు కళాశాల అభివృద్ధి కోసం మరియు హాస్టల్ కోసం ఆర్థిక సహాయం అందజేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. కామర్స్ మరియు బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల ఏర్పాటు చేసి 50 సంవత్సరాల అవుతున్న సందర్భంగా కళాశాల నూతన భవనం నిర్మిస్తామని తెలియజేశారు. విద్యార్థులు ఆటపాటలతో అందరినీ అలరించారు.
- Category
- Management
Be the first to comment