ఇకమీదట చెరువుల ఆక్రమణలు జరగబోనివ్వం | 3 Types of Plans to be Implemented for Tanks | KTR

2 Views
Published
హైదరాబాద్ పరిధిలోని చెరువుల పరిరక్షణకు మూడు రకాల ప్రణాళికను సిద్ధం చేశామని మంత్రి KTR శాసనసభలో వెల్లడించారు. సభ్యులు మాధవరం కృష్ణారావు, ప్రకాశ్ గౌడ్ , బేతి సుభాష్ రెడ్డి, అక్బరుద్దీన్ తదితరులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. సమగ్ర చెరువుల అభివృద్ధి ప్రణాళికలో భాగంగా చేపట్టిన చర్యలను ప్రస్తావించారు. ఫెన్సింగ్, చుట్టూ వాకింగ్ ట్రాక్ , సుందరీకరణ, మురుగు కాల్వల మళ్లింపు తదితర అంశాలను వివరించారు. నగరం పరిధిలో 185 చెరువులు ఉండగా.. 127 అభివృద్ధికి చర్యలు చేపట్టామన్నారు. ఇప్పటికే 48 చెరువులను అభివృద్ధి చేశామని తెలిపారు. 407 కోట్ల 30 లక్షలు మంజూరు చేయగా.. 218 కోట్లు ఖర్చు చేశామని పేర్కొన్నారు. 30 కోట్ల 50 లక్షలు అంచనా వ్యయంతో వర్షాలకు దెబ్బతిన్న 45 చెరువులకు మరమ్మతులు చేపట్టామన్నారు. కబ్జాతో చెరువుుల కుంచించుకుపోయాయని.. FTL, బఫర్ జోన్ లో నిర్మాణాలను తొలగిస్తామని స్పష్టంచేశారు. చెరువుల పరిరక్షణకు కొత్త డివిజన్ ఏర్పాటు చేసి లేక్స్ స్పెషల్ కమిషనర్ ను నియామిస్తామని మంత్రి KTR అసెంబ్లీలో వెల్లడించారు.
#EtvTelangana
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us : https://www.facebook.com/ETVTelangana
☛ Follow us : https://twitter.com/etvtelangana
☛ Follow us : https://www.instagram.com/etvtelangana
☛ Etv Win Website : https://www.etvwin.com/
-------------------------------------------------------------------------------------------------------
Category
Management
Be the first to comment